మన్యం న్యూస్ చండ్రుగొండ, మార్చి 15: కార్యకర్తలకు అండగా ఉండే నాయకులకు ప్రజల్లో ఎప్పుడు తగిన గుర్తింపు ఉంటుందని మండల బిఆర్ఎస్ నాయకులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. బుధవారం ప్రధాన సెంటర్లో బిఆర్ఎస్ మండల కమిటీ ఆద్వర్యంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేశారు. కేక్ ను కత్తింరించి, మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…. ప్రజలకు మంచిచేసే నాయకులకు అండగా ఉంటామన్నారు. తిప్పనపల్లి గ్రామంలోని దళితకాలనీ ఎంపీ నామా జన్మదిన వేడుకలు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గుంపెన సోసైటి వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి, సర్పంచ్లు పూసం వెంకటేశ్వర్లు, బానోత్ రన్య, బానోత్ కుమారి, బిఆర్ఎస్ నాయకులు మేడా మోహన్రావు, భూపతి శ్రీనివాసరావు, మద్దిరాల చిన్నపిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు





