మన్యం న్యూస్, పినపాక, మార్చి 15
పినపాక నియోజకవర్గం నుంచి గురువారం రోజున అదిలాబాద్ జిల్లాలో జరగనున్న పీపుల్స్ మార్ట్ పాదయాత్రకు సంఘీభావంగా బుధవారం నియోజకవర్గ నుంచి సుమారు 100 మంది కార్యకర్తలతో వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం తెలియజేశారు. ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పిసిసి సభ్యులు చక్రవర్తి, చందా సంతోష్ పినపాక మండల అధ్యక్షులు రామనాథం లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హాథ్ జోడోయాత్ర విజయవంతమైన సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్ట్ పాదయాత్ర అంతకు రెట్టింపుగా విజయవంతం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెల్లంకొండ వాసుదేవ్, బషీరుద్దీన్, బుజ్జిబాబు, మదర్ సాహెబ్ , తదితరులు పాల్గొన్నారు





