- నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు…
- ఆదాయం రెట్టింపు కోసం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూనా వైన్స్ యజమాన్యం…
- ఎక్సైజ్ అధికారుల దర్శన భాగ్ ఎప్పుడు.?
- వార్తాపత్రికల్లో అనేక కథనాలు వచ్చిన అధికారుల నిర్లక్ష్యం వెనక గోప్యం ఏమిటి…?
- గుడి బడి తేడా లేకుండా వెలుస్తున్నా బెల్ట్ షాపులు.
మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం,మార్చి15.
మండల కేంద్రంలో రోజు రోజుకి విచ్చలవిడి గా మందు దుకాణాలు దర్శనమిస్తున్నాయి. ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టమైన అంత రేటుకు అమ్మకాలు జరుగుతున్నాయి.
వైన్ షాప్ లో ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన నిష్ఠిత ధరకి మద్యం విక్రయించడం కొనసాగించాలి,
కానీ వైన్ షాపులు తంతు చూస్తే అధిక వసూలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మద్యం అధిక విక్రయo లక్షoగా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో బెల్ట్ షాపులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వైన్ షాపు యజమానులు విక్రయాలు టార్గెట్లను అధిగమించేందుకు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,
మండల పరిధిలో వందలాది బెల్ట్ షాపులు కనివిని ఎరుగని రీతిలో వెలిశాయని దీంతో వీధి వీధిలో గుడి ముందు బడి ముందు మందు బాబులు జోగుతున్నరని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం వ్యాపారం జోరుగా సాగేందుకు వైన్ షాప్ యాజమాన్యం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో ఎక్సైజ్ అధికారులు మమేఖంగా ఉండడంతో మద్యం షాపుల ఓనర్లు మునుపెన్నడు లేని విధంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మండలంలో వందలాది బెల్ట్ షాపుల దందా ఏదేచ్ఛగా సాగుతుండ టం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని బెల్ట్ షాపులను నిర్మూలించాల్సిన అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలు తీవ్ర కోప సoద్రంలో ఉన్నారు. తమ పిల్లలు భవిష్యత్తు తమ కుటుంబ భవిష్యత్తు ఏమైపోతాయని ఈమధ్యం తాగి కుటుంబ పోషణ కూడా తమ భర్తలు పట్టించుకుంటలేరని తమ జీవితాలను ఈ బెల్ట్ షాపులు ఉండటం వల్ల చిన్న భిన్నం అయిపోతున్నాయని గ్రామ ప్రజలు వారి గోడును వెళ్లగక్కారు. అక్రమంగా వెలిసిన బెల్ట్ షాపులు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయని ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో బెల్ట్ షాపులు అశాంతిని రేపుతున్నాయని అందుబాటులో బెల్ట్ షాపులు ఉండడంతో మద్యానికి బానిసలు అవుతున్నారని దీంతో కుటుంబాల్లో గొడవలు కలతలు నిత్యకృత్యo అవుతునాయని. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలు అవుతున్నారని బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలను తమ ఇష్టానుసారంగా సాగిస్తు. కుటుంబాల వినాశనానికి కారణమైన బెల్ట్ షాపులను రద్దు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఆదాయం రెట్టింపు కొరకు బెల్ట్ షాపులకు ప్రోత్సాహం ఇస్తున్న వైన్ షాప్ యాజమాన్యం.
అంతేకాకుండా తమ ఆదాయం రెట్టింపు కోసం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న వైన్ షాప్ యజమాన్యం వివిధ రకాల బ్రాండ్లు కలిగిన, కింగ్ ఫిషర్ బీర్, రాయల్ స్టాక్, ఐబీ, ఎంఎచ్ మద్యం బాటిల్ లను బెల్ట్ షాపులకు తరలిస్తూ మైదాన ప్రాంతంలో విక్రయాలు జరగని మద్యం సీసాలను వైన్ షాపుల్లో ఉంచుతూ మద్యం ప్రియులు మద్యం శేవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేస్తున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బెల్ట్ షాపుల దందాకు అవకాశం ఇస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. మద్యం షాపుల వద్ద ఎమ్మార్పీ ధరల పట్టిక ఏర్పాటు చేయాలని. నిష్ఠిత ధరలకే విక్రయాలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎక్సైజ్ అధికారుల దర్శన భాగ్యం ఎప్పుడు.?
సిండికేట్ కనుసైగలోనే ఇదంతా జరుగుతుందని మండల పరిధిలోగల బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు కొరడాలు చూపించకుండా ఆదివాసి గుడాళ్లలో కళ్ళు స్థావరాలు పై మాత్రం వారి అధికారాన్ని చాలఇస్తున్నారని. అక్రమ మందు దోపిడీదారులు అరికట్టరని బడి గుడి అని తేడా లేకుండా బడికి వెళ్లే దారిలోనే మద్యం దుకాణాలు విచ్చడవిడిగా తెరిచి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఆటంకం కలిగిస్తున్నారని అధికారుల దర్శన భాగ్యం ఎప్పుడు అవుతుంది అని ప్రజలు వాపోతున్నారు…
వార్తాపత్రికల్లో అనేక కధనాలు వచ్చిన అధికారుల నిర్లక్ష్యం వెనక గోప్యం ఏమిటి.?
పలుమార్లు వార్త పత్రికల్లో కథనాలు వచ్చిన అధికారులకి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ దాన్ని తేలిగ్గా కొట్టి పారేస్తున్నారని పలుమార్లు కథనాలు వార్తలు రాస్తున్నప్పటికీ అధికారులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారనిగ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా కళ్ళు తెరిచి ఉన్నత అధికారులు సంబంధిత శాఖ వారు అడ్డదిడ్డంగా వెలుస్తున్నా వందలాది బెల్ట్ షాపులపై కొరడా విధించాలని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారి పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.





