మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం , మార్చి 15: ఏజెన్సీ ప్రాంతంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్ చేశారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమై ఆయన మాట్లాడారు. ఏజెన్సీ దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తించడం లేదని ఆవేదన చెందారు. పుట్టినభూమిపై హక్కు లేదని, రాజకీయ రిజర్వేషన్ లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు వర్తించడం లేదని తెలిపారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఏజెన్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని , పుట్టిన భూమిపై హక్కు కల్పించి రైతు బంధు, రైతు భీమా లాంటి , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు , ప్రతి కుటుంబానికి దళిత బంధు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని సూచించారు .అలాగే వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమతా సమతా సైనిక్ దళ్ నాయకులు బండారి శివ శంకర్, ఓరేం రవికుమార్,సానపురి శ్రీనివాస్, ఆవుల వేణు, రామటేంకి మల్లేష్, జాడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు





