మన్యం న్యూస్ దుమ్ముగూడెం , మార్చి 15
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా కొత్త నెంబర్లకు మీ సమాచారాన్ని అందించవద్దని దుమ్ముగూడెం ఎస్సై రవికుమార్ సూచించారు. మండలంలోని ములకపాడు హస్పటల్ క్రీడామైదానంలో ఉన్నటువంటి యువతతో వారు సైబర్ నేరాలపై బుధవారం అవగాహన కల్పించారు ఈ సందర్భంగా దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు ఎస్ఐ యువకులతో మాట్లాడుతూ మండలంలోని మొలకపాడు రేగుపల్లి గ్రామాల్లో ఆన్లైన్ మోసాలతో డబ్బులు పోగొట్టుకున్నారని ఎవరు కూడా అత్యాశకు పోయి మీ సమాచారాన్ని కొత్త వ్యక్తులకి తెలపరాదని హెచ్చరించారు. అలానే యువత మద్యం సేవించి వాహనాలు నడప రాదని ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కృష్ణారావు శంకరన్న పండు దుమ్ముగూడెం యువత హేమంత్ రఘు నేతాజీ ప్రదీప్ వర్మ రాజు తదితరులు పాల్గొన్నారు.





