మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు గురువారం నిర్వహించారు. కళాశాల పలు తరగతి గదులలో పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థుల పరీక్ష పేపర్లను,పరీక్ష కేంద్రాన్ని తహశీల్దార్ గూడూరు లక్ష్మణ్ తనిఖీ చేశారు.