మన్యం న్యూస్, పినపాక:
ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాలకు సైతం రహదారులు ఏర్పడుతున్నాయని, గ్రామాలలో వర్షాకాలంలో పడ్డ ఇబ్బందులు తొలగనున్నాయని అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ అన్నారు.
పినపాక మండలం అమరారం గ్రామంలో పలు రహదారులకు సీసీ రోడ్ లను గురువారం గ్రామ సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అదేశానుసారం గ్రామంలో రహదార్లకు శంకుస్థాపన చేశామని తెలియజేశారు. ఎంతోకాలంగా రహదారులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు రహదారులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్లు ఎంపీటీసీ కాయం శేఖర్ తెలిపారు.. ఈ
కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవివర్మ , ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, అమరారం ఉప సర్పంచ్ కొమరం రాంబాబు, బిఆర్ఎస్ నాయకులు బుల్లి బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలెబోయిన నరేష్ , కొట్టెం ప్రసాదు, వజ్జ దశరధం, వార్డ్ నెంబర్లు యాలం మల్లయ్య, తోలేం సాగర్, యాలం పెంట్టయ్య ,కుర్సం రామ్మూర్తి, పాష తదితరులు పాల్గొన్నారు.