మన్యం న్యూస్, మణుగూరు, మార్చి16: ఎమ్మెల్సీ కవిత పై కక్షపూరిత ఈడీ దర్యాప్తులను వెనక్కి తీసుకోవాలని మణుగూరు జడ్పిటిసి పోషం నరసింహారావు అన్నారు. గురువారం మణుగూరు మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి బెదిరింపులకు, ఈడి నోటీసులకు భయపడే పార్టీ మాది కాదని, అవినీతిపై పోరాడే బిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ మాదన్నారు. నరేంద్ర మోడీ ఎమ్మెల్సీ కవితపై ఈడీ కక్షపూరిత దర్యాప్తులను వెనక్కు తీసుకోకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ నిలదొక్కుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఎన్ని కుట్రలు పన్నిన తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ఉన్నారన్నారు. రాబోయే రోజులలో కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, యువత,కార్యకర్తలు పాల్గొన్నారు.
