మన్యం న్యూస్ మణుగూరు టౌన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా ఉపరితల గనులలో భారీ యంత్రాలు నడిపే ఆపరేటర్లు రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జె.వి రమణ తెలిపారు.గురువారం నాడు ఓసి 4 లో మట్టి వెలికితీత ఓబీ పనులు నిర్వహిస్తున్న దుర్గ ఓబి కంపెనీలో లాగ్ బుక్ నిర్వహణ ఆపరేటర్ల బాధ్యత అనే అంశంపై పీకే ఓసి రక్షణ విభాగం నిర్వహించిన కార్మికుల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.భారీ యంత్రాలు వోల్వో టిప్పర్,సానీ డంపర్,షావెల్స్,మోటారు గ్రేడర్లు,బుల్ డోజర్లు,వాటర్ స్ప్రింక్లర్లు,డ్రిల్స్,క్రేన్ లు నడిపే ప్రతి ఒక్క ఆపరేటర్,డ్రైవర్ ఆయా యంత్రాలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నాయని, లేకపోతే లేనట్లుగా లాగ్ బుక్ లో నమోదు చేయాలని అని తెలిపారు.లాగ్ బుక్ నిర్వహణ ఆపరేటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని,రక్షణ పరంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనీ అన్నారు.డ్యటీ ఎక్కే ఆపరేటర్ సంబంధిత అంశాలను తనిఖీ చేసుకోవాలని,లాగ్ బుక్ నిర్వహణతో పాటు రానున్న వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్క ఆపరేటర్ భారీ యంత్రాలపై ఏర్పాటు చేసిన అగ్ని మాపక సాధనాలు ఉపయోగించు విధానంపై సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు.అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలని ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నారు.రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడమే సింగరేణి లక్ష్యం అని మణుగూరు ఏరియా రక్షణ అధికారి జే వి రమణ తెలిపారు.అనంతరం పీకే ఓ సి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు మాట్లాడుతూ,సెల్ ఫోన్ డ్రైవింగ్,మత్తు పదార్థాలు,రాత్రి బదిలీలో తగు విశ్రాంతి, అతివేగం,సీట్ బెల్ట్, ట్రాఫిక్ రూల్స్ తదితర అంశాలపై కార్మికులకు తెలుగు,హిందీ భాషలలో అవగాహన కల్పించారు.అనంతరం అందరూ సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమం లో పీకే ఓసి ప్రాజెక్టు మేనేజర్ మాలోత్ రాముడు,ఓసి 4 మేనేజర్ దేవసాని శ్రీనివాస్, గోపి ఇంచార్జ్,గుడిగంటి కళ్యాణ్ రామ్,రక్షణ అధికారి మేదురి లింగబాబు,దుర్గ ఓబీ కంపెనీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.