మన్యం న్యూస్.ములకలపల్లి.మార్చి 16.ఐసీడీఎస్ ములకలపల్లి సెక్ట్రార్ లో మండల కేంద్రంలోని గుడ్ షెఫర్డ్ సంస్థ ఆవరణలోని మీటింగ్ హాల్లో అంగన్ వాడి సూపర్వైజర్ సామ్రాజ్యం ఆధ్వర్యంలో 15 మంది గర్భిణీలకు శ్రీమంతం వేడుకలు, ముగ్గురు పిల్లలకు పుట్టినరోజు వేడుకలతో పాటు ఒకరికి అన్నప్రాసన వేడుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్న 15 మంది గర్భిణీ లకు చీరె, జాకెట్, పూలు, పండ్లతో పాటు గాజులను బహుకరించారు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని,గర్భిణిలు వారి గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో అందించబడే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ శనగపాటి మొహారా మణి, గుడ్ షఫర్డ్ సిస్టర్ నిర్మల, ఏఎన్ఎం విజయలక్ష్మి తో పాటు సెక్టార్ పరిధిలోని అగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
