మన్యం న్యూస్ వాజేడు మార్చి 16.
ములుగు జిల్లా వాజేడు మండలంలో అకాల వర్షం కురవడంతో ఆరుగాలం పండించి పంట చేతికొచ్చి మార్కెట్లో విక్రయించే సమయంలో అకాల వర్షం కురిసి అన్నదాతలను అప్పుల్లోకి కూరకపోయే పరిస్థితులు ప్రధానంగా మిర్చి రైతులపై ప్రభావం పడుతుందని మిర్చి పంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
మిర్చి రైతుల పంటల కు తామర పురుగు, నల్లి, ఆకు తెగులు, కుళ్ళు తెగులు, పలు రకాల వ్యాధుల పట్ల మందులు పిచికారి చేసి చేసి విసిగిపోయిన రైతులను ఒక పట్టాన ఫెర్టిలైజర్స్ షాప్స్ అధిక ధరలకు రసాయన ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తుంటే మరో పట్టాన పలు రకాల వ్యాధులు, ప్రకృతి విపరీత్యాలు రైతులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వాతావరణం లోపంతో పంట దిగుబడి రాక రైతులు అధిక మొత్తంలో నష్టపోతున్నారనేది అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇలా అన్ని విధాలుగా రైతుల చుట్టూ అనేక సమస్యలతో సతమతమవుతూ ఆత్మ హత్యలు సైతం చేసుకునే వారు లేకపోలేదు, ఇలాంటి పరిస్థితులలో రైతులను ప్రభుత్వం నేరుగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.