మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 16, మండల కేంద్రం లోని పత్తి మార్కెట్ యార్డ్ సమీపంలో గురువారం స్థానిక పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బండిని ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తులను ఎస్సై పోటు గణేష్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా, తాము ఒరిస్సా నుంచి హైదరాబాదుకు గంజాయి తరలిస్తున్నామని, పారిపోయే క్రమంలో పంట పొలాల్లో పడేసామని తెలపడంతో, సుమారు 10 కేజీల గంజాయిని, రెండు సెల్ ఫోన్ లను, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడ్డ నిందితులు మహారాష్ట్ర లోని అమరావతికి చెందిన షేక్ సల్మాన్, హైదరాబాద్ కంచన్ బాగ్ కు చెందిన షేక్ యూనస్ లుగా గుర్తించామని వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పోటు గణేష్ తెలిపారు. నిందితులను వెంబడించి పట్టుకున్న వారిలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శివాజీ గణేష్, రవి, ప్రసాదు లు ఉన్నారు.
