UPDATES  

 కంటి వెలుగు దేశానికే ఆదర్శం: ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ మార్చి 17.. ఇల్లందు మండలం సుభాష్ నగర్ కరెంట్ ఆఫీస్ ఏరియాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామాల్లో సైతం కంటి పరీక్షలు నిర్వహించి నిరుపేదలకు ఉచితంగా కళ్ల అద్దాలు, మాత్రలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని తెలిపారు.అదేవిధంగా గతంలో ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో పలు రాష్ట్రాల సీఎంలు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిశీలించి సీఎం కేసీఆర్ ని అభినందించి కొనియాడారని అన్నారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలను ప్రవేశ పెట్టేందుకు ఆలోచన చేసి రూపకల్పన చేస్తామని వారు తెలిపినట్లు హరిప్రియ తెలిపారు. ప్రస్తుతకాలంలో నిరుపేదలు కంటి పరీక్షలు చేయించుకోవాలన్నా, కళ్ళద్దాలు తీసుకోవాలన్నా, శస్త్ర చికిత్సలు చేయించుకోవాలన్నా సరైన ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్నారన్నారు. నిరుపేదల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగిందని, నియోజకవర్గంలోని పేదలు కంటివెలుగు పథకం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులను చూస్తున్నారన్నారు. పట్టణ, గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు కంటి వెలుగు కార్యక్రమం పై ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. అనంతరం సుభాష్ నగర్లో ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి రోగులతో ఎమ్మెల్యే మాట్లాడారు. తమకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపును ప్రసాదించి నూతన జీవితాన్ని అందజేస్తున్నందుకు సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం రమేష్, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, సర్పంచ్ వల్లాల మంగమ్మ, ఎంపీటీసీ ఉమాదేవి, మండల కో ఆప్షన్ సభ్యులు గాజి, డాక్టర్ కవిత నాయకులు వల్లాల నరసయ్య, తాళ్ల నాగేశ్వరరావు, భూక్య కోటి, ఏఎన్ఎంలు, వార్డు సభ్యులు పంచాయతీ సెక్రెటరీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !