మన్యం న్యూస్ గుండాల మార్చి 17: కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటానని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్ర వారం గుండాల మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరగడంతో అతని ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానని మరచిపోవద్దని ఆయన పేర్కొన్నారు. తనను నమ్ముకొని తన వెంట తిరిగే వారికి బాసటగా నిలుస్తానని అన్నారు. అనంతరం శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతామని రేగా పేర్కొనడంతో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, మైనారిటీ జిల్లా అధ్యక్షులు అన్వర్,గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, అధికార ప్రతినిధి రాము,ఎస్ బి సి సెల్ అధ్యక్షులు రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు వట్టం రవి, కొరస లాలయ్య, సుధాకర్, చుక్క వీరన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
