మన్యం న్యూస్ దుమ్ముగూడెం , మార్చి 17
అత్యవసర సమయంలో ఏదైనా ప్రమాదం సంబంధించిన ప్రజలు 108 సర్వీసును వినియోగించుకుంటూ ఉంటారు. అలాంటి 108 అంబులెన్స్ సర్వీస్ గత కొంతకాలంగా రోగం వచ్చింది ఎక్కడపడితే అక్కడ ఆగిపోయి స్టార్టింగ్ ట్రబుల్ తో కొనసాగుతుంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అంబులెన్స్ స్టార్ట్ చేయాలంటే ఎవరైనా వచ్చేవరకు ఉండి తోయాల్సి వస్తుందని ప్రజలు, పైలట్ తెలిపారు. దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా చిన్న నల్లబెల్లి నందు ఒకటే 108 సర్వీస్ ఉండగా అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు అయిపోతుందో తెలియదని గ్రామస్తులు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 108 వాహన మరమ్మత్తులు చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు