మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 17: మండల వ్యాప్తంగా రెండు రోజులుగా ఓ మోస్తారు వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులతో మొదలైన వాన ఓ మోస్తారుగా కురిసింది. ప్రధానంగా మండలంలోని మిరప రైతులకు కొంత మేరకు నష్టం వాటిల్లిందనే చెప్పాలి. చండ్రుగొండ, గానుగపాడు, గుర్రంగూడెం, బెండాలపాడు, రవికంపాడు, పోకలగూడెం, వెంకట్యతండా గ్రామాలలో కోసిన మిరపకాయల్ని రైతులు పంటకల్లాలలో ఆరబోసినారు. వర్షం కారణంగా కొంతమేర తడిసిన, చాలావరకు మిరపకాయలు తడవకుండా పట్టాలు కప్పుకున్నారు. అకాలవర్షాలకు అన్నదాతలకు కష్టాలు మొదలై తడిచిన మిరపకాయలను ఆరబెట్టే పనిలో ఉన్నారు. ఈ వాన మామిడి రైతులకు కొంతమేర ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తెలుపుతున్నారు.
