- అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ ఆగడాలు….
- – ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న డీలర్లు.
- -నిత్యం పట్టణంలోని డీలర్లకు సిలిండర్ల సరఫరా.
- – మూడు కమర్షియల్ సిలిండర్లు ఆరు డొమెస్టిక్ సిలిండర్లు.
- – పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు.
మన్యం న్యూస్, మణుగూరు, మార్చి17: అభిరామ్ హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కంజ్యూమర్స్ కు సంబంధించిన సిలిండర్లు సొమ్ములకు ఆశపడి అమ్ముకుంటున్నారు. నిత్యం టాటా ఏస్,అప్పి ఆటోలలో దందా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్స్ లో కంజ్యూమర్స్ కు సంబంధించిన సిలిండర్లను అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. దీంతో వారి వ్యాపారం మూడు కమర్షియల్ సిలిండర్లు ఆరు డొమెస్టిక్ సిలిండర్లుగా సాగుతోంది. అధికారులకు కూడా ముడుపులు అందడంతో తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రూల్స్ ప్రకారం హోటల్స్ లో కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలి కానీ ఇందుకు విరుద్ధంగా అభిరామ్ ఏజెన్సీ వారు డొమెస్టిక్ సిలిండర్లను హోటల్స్ లో అమ్ముతున్నారు. ఇష్టారాజ్యాంగ నడి రోడ్లపై తమ వాహనాలు నిలిపి బహిరంగంగానే వ్యాపారం చేస్తున్నారు. అయినా కానీ ఈ దందా గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. దీంతో వారిని ఆపేవారు లేక దందా జోరుగా నడుస్తుంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ లను బ్లాక్ లో విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీకి 15 కిలోమీటర్ల వరకే విక్రయాలు తెరపాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి.
– వాణిజ్య అవసరాలకే అధిక వినియోగం…..
గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్ లను వాణిజ్య అవసరాలకు అధికంగా విక్రయిస్తున్నారు. చట్ట వ్యతిరేకం అని తెలిసినా ఏమవుతుందిలే అనే ధీమాతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగించడం వలన కొరత ఏర్పడి గృహ అవసరాలకు వినియోగదారులపై అధిక భారం పడుతుంది.
-మామూళ్ల మత్తులో అధికారులు…..
పినపాక నియోజకవర్గం లో గ్యాస్ సిలిండర్ల విక్రయాలను పరిశీలిస్తే సివిల్ సప్లై అధికారులు ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. ప్రధాన రహదారిపై గ్యాస్ సరఫరా చేసే వాహనాలను నిలిపి మరి వ్యాపార, వాణిజ్య సముదాయాలకు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ లను సరఫరా చేస్తున్నారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. ఒక్కో వాణిజ్య సముదాయం కు రోజుకు కనీసం నాలుగు సిలిండర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు సివిల్ సప్లై అధికారులకు మధ్య మంచి సన్నిహిత్యం ఉన్నట్లుగా అద్ధం పడుతోంది.
– హోటల్స్ కు సిలిండర్లు వేస్తే సీజ్ చేస్తాం….
– సివిల్ సప్లై డీటీ శ్రీనివాసులు.
హోటల్స్ లో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను విక్రయిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అభిరామ్ గ్యాస్ ఏజెన్సీకి హోటల్స్ లో సిలిండర్లు వేసేందుకు ఎలాంటి అనుమతులు లేవు. త్వరలో తనిఖీలు నిర్వహించి హోటల్స్ లో గృహ అవసరాలకు వాడే సిలిండర్లు దొరికితే వాటిని సీజ్ చేస్తాం.