మన్యం న్యూస్, పినపాక, మార్చి 17
తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు వివాహ సందర్భంగా అందించే కల్యాణ లక్ష్మి చెక్కులను పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ శుక్రవారం నాడు ఆయన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదండి ఆడబిడ్డ ఎలా వివాహానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, ప్రతి పేదంటి ఆడబిడ్డ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.