మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
పి వై ఎల్ జిల్లా కార్యదర్శి పర్షిక రవి
మన్యం న్యూస్ గుండాల, మార్చి 17 దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని పి వై ఎల్ కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పరిషిక రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలనలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. రాష్ట్రంలో సైతం ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని అన్నారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 92వ వర్ధంతిని సభలను గ్రామ గ్రామాన నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప సర్పంచ్ ఉపేందర్, శేఖర్, రమేష్ , లాజర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.