మన్యం న్యూస్, పినపాక , మార్చి 17
మాల మహానాడు పినపాక మండల కమిటీని శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. పినపాక మండలంలో గత సంవత్సర కాలంగా పినపాక మండల కమిటీ మాలల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మాలల సమస్యల కొరకు పోరాడుతూ, మాలల శ్రేయస్సు కొరకై పనిచేస్తున్న పినపాక మండల కమిటీని అభినందిస్తూ వారికి ఉన్నత పదవులను ఇచ్చి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకులు తల్ల మల్ల హసీన్ , కూరపాటి రవీందర్ ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మండల అధ్యక్షులుగా నువ్వుల కృష్ణ, సహాయ కార్యదర్శిగా భాను పల్లి బాలకృష్ణ, కోశాధికారిగా చల్లా మోహన్, డివిజన్ అధ్యక్షుడిగా చీకటి రఘు, సహాయ కార్యదర్శిగా బోడ సర్వేశ్వరరావు లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుదిగొండ రామకృష్ణ, సహాయ కార్యదర్శి దాసరి రవికుమార్, డివిజన్ ఉపాధ్యక్షులు కోడి రెక్కల రమేష్, డివిజన్ కార్యదర్శి నక్క ప్రశాంత్ పాల్గొన్నారు.