మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 17 అకాల వర్షం అన్నదాత తో పాటు ప్రజానీకానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఉదయం 5 గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో జిల్లాలోని పలు ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. ప్రధానంగా ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరపు పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం నమోదు కావడంతో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు హాజరయ్యేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు జోరు వాన మరోవైపు పరీక్షలు వీటిని అధిగమించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పడిన కష్టం వర్ణనాతీతం. ఉదయం ఎనిమిదిన్నర గంటలకే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు హాజరయ్యేవారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం వల్ల అయ్యా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు పడిన కష్టం వారికి పరీక్షగా మారింది. దీంతోపాటు ఉదయం 6 గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఆకాశం మేఘావృతమై చిమ్మ చీకట్లు కమ్ముకొని అతి చల్లమైన ఈదురు గాలులతో ఓ మోస్తారు వర్షం కురడంతో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుండపోతగా కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం కలగడంతో పాటు పరీక్ష గదులలో విద్యుత్ అంతరాయం కలగడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు జోరు వాన మరోవైపు పరీక్ష తరగతి గదిలో చిమ్మ చీకటి పరీక్ష రాస్తే విద్యార్థులకు కష్టతరంగా మారింది. ఉదయం 8 గంటల సమయంలో కూడా సూర్యుడు తన ప్రభావం చూపకపోవడంతో పాటు నీలి మేఘాలు కమ్ముకొని పట్టపగలే చిమ్మ చీకటిగా మారిన ప్రధాన కూడలిలో వాహనదారులు తమ తమ వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నమోదైన అకాల వర్షం వలన చేతికొచ్చిన మిర్చి పంట చేజారడం. .. పరీక్ష రాసే ఇంటర్ విద్యార్థులకు అసౌకర్యం కలగడం.. ప్రకృతి వైపరీత్యం అగమ్మీ గోచరంగా మారడం అనడేది ప్రశ్నార్థకంగా మారింది
