మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 17.. ఉద్యమాలు ఉదృతం అయితే పాలకులు తోక ముడుస్తారని బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.ఆర్ఎస్పీ తన స్వగృహంలో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తనను పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వీటన్నిటిని చేదించుకొని ప్రవీణ్ కుమార్ ను ఆయన స్వగృహంలోనే కలవడం జరిగిందన్నారు.శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ను అక్రమ పద్ధతిలో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు,ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దీక్షకు భయపడిన ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం బీఎస్పీ సాధించిన విజయంగా అభివర్ణించారు.తూతుమంత్రంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి చేతులుదులుపు కోవడం కాదని,ప్రశ్నపత్రాల లీకేజీ పై సీబీఐ విచారణ జరిపించాలని,టీఎస్ పిఎస్సీ సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.ఒకవైపు నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి తుంగలో తొక్కిన టిఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ పేరుతో పరీక్షలు నిర్వహించినట్లు చేసి లీకుల పర్వానికి ఒడిగట్టిందని ఇదంతా బిఆర్ఎస్ పెద్దల కనుసనల్లో జరిగినట్లు ఆరోపించారు.
ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్, నల్లగట్ల రఘు,సాయి,దాసు* తదితరులు పాల్గొన్నారు.