మన్యం న్యూస్, దుమ్ముగూడెం, మార్చి 17
తుఫాను కారణంగా రైతులు ఆరుగాలం పండించిన పంట వర్షం వల్ల నష్టపోయిందని నష్టపోయిన రైతంగాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని దుమ్ముగూడెం మండల రైతు సంఘం అధ్యక్షులు బొల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటలను శుక్రవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి మద్దతు కల్పించాలని కోరారు. గోదావరి పరివాహ ప్రాంతంలో గతంలో వరదల కారణంగా రైతాంగం అనేక రకాలుగా నష్టపోయిందని ఇప్పుడు పంట చేతికొచ్చే సమయానికి మళ్ళీ అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుని తడిసిన పంటను కూడా కొనుగోలు చేయాలని కోరారు.