మన్యంన్యూస్,ఇల్లందుపట్టణం మార్చి 18:..జీవో నెంబర్ 76 ప్రకారం ఇల్లందు పురపాలక సంఘ పరిధిలోని సింగరేణి భూములలో వున్న నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించిందని ఈ అవకాశాన్ని ఇల్లందు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు శనివారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గతంలో 2014 లోపు సక్రమంగా ఇంటి పన్ను కడుతున్న వారికి క్రమబద్ధీకరణ చేసుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని తెలిపారు. ఆ సమయంలో సమాచారలోపం వల్ల కానీ లేక మరే ఇతర కారణాల వల్ల కానీ క్రమబద్దీకరణ చేసుకోని వారికి ఆ దిశగా రాష్ట్ర క్యాబినెట్ చర్చించి క్రమబద్ధీకరణకు 2020 లోపు ఇంటి నిర్మాణం చేపట్టి ఇంటి పన్ను కడుతున్న వారికి అట్టి ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు రాబోయే ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి 30వ తారీకు వరకు అవకాశం కల్పించిందని అన్నారు. ఇట్టి సువర్ణ అవకాశాన్ని ఇల్లందు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకొని ఇంటి నిర్మాణాలపైన యాజమాన్య హక్కులు పొందాలని ఛైర్మెన్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
