మన్యం న్యూస్, పినపాక, మార్చి 18
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూల్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొర్స గణేష్- ప్రసన్న ల వివాహ వేడుకకు శనివారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సర్పంచ్ కోరం రజిని, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, కృష్ణారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.