UPDATES  

 సీసీ రోడ్డుకు శంకు స్థాపన చేసిన మండల నాయకులు…

మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి 18: అశ్వారావుపేట మండలం, గుర్రాల చెరువు గ్రామ పంచాయతీలో పరిధిలో రూ.5లక్షల నిధులతో మంజూరు చేసిన సీసీ రోడ్లను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ఆదేశానుసారం శనివారం సీసీ రోడ్డుకి అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి శంకుస్థాపన చేశారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెను అందంగ తీర్చిదిద్దాలనే సంకల్పంతో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ప్రత్యేక శ్రద్ధతో అశ్వారావుపేట నియోజక వర్గానికి రూ.30 కోట్ల సీసీ రోడ్ల ఏర్పాటుకి అత్యధిక నిధులను మంజూరు చేశారని ప్రతి గ్రామంలో మట్టి రోడ్డు కనపడకుండా ఉందంటే అది ఎమ్మెల్యే మెచ్చా పట్టుదల కృషి అని అన్నారు. ఎమ్మెల్యే మెచ్చానే వచ్చే ఎన్నికలలో ఆయనకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలపాలా దుర్గయ్య, మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, జుజ్జూరపు వెంకన్న, శ్రీనివాస రావు, గుడవర్తి వేంకటేశ్వర రావు, సత్యనారాయణ, సురేష్, గ్రామ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !