మన్యం న్యూస్, ఇల్లందు టౌన్ మార్చి 18:ఇల్లందు మున్సిపాలిటీలో వేసివి వచ్చిందంటే పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో బెంబేలెత్తిపోతారని. ఈ నేపథ్యంలో వేసవికాలంలో పట్టణ ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు శనివారం మున్సిపల్ కార్యాలయం నందు ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు సిబ్బందితో ఇల్లందు మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకుషావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఎవరు కూడా నీటి సమస్యతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ యంత్రాంగం కటినచర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రతిరోజు లేక రోజువిడిచి రోజు తాగునీటిని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ ఏఈ శంకర్, ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది ఫయాజ్ బాబా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
