మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సతీమణి సుధారాణి శనివారం ఆళ్లపల్లి మండలంలోని పలు శుభకార్యాలకు హాజరయ్యారు. మర్కోడు గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు కంచర్ల రవి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధువు వధువులను ఆశీర్వదించారు. అనంతరం ఆళ్లపల్లి మండల కేంద్రంలోనీ వ్యాపారస్తులు అబ్బు నాగేశ్వరరావు నూతన గృహ ప్రవేశ వేడుకకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
