మన్యం న్యూస్ గుండాల మార్చి 18: అకాల వర్షం రైతాంగానికి కన్నీరుని మిగిల్చింది. మండలంలో గురువారం, శుక్రవారం కురిసిన వర్షానికి పంటలు నేల రాలడంతో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. నరసాపురం తండ, రోళ్లగడ్డ తండ, ఏరియాలలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట సాగు చేశారు. అకాల వర్షం దెబ్బకు పంట దెబ్బ తినడంతో రైతన్న లకు పెద్ద ఎత్తున నష్టం వాటిలిందని రైతులు పేర్కొంటున్నారు. మండలంలోని రైతాంగం మొక్కజొన్న పొద్దు తిరుగుడు పంటలు గత కొన్ని సంవత్సరాలుగా వేసంగి సాగు చేసుకుంటున్నారు. నరసాపురం తండాకు చెందిన జటోత్ మనోజ్ యాసంగి మొక్కజొన్న సాగు చేశాడు అకాల వర్షానికి పంట నేలరాలడంతో రెండులక్షల కు మేర నష్ట వాటిలిందని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లడంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు
