మన్యం న్యూస్ దుమ్ముగూడెం, మార్చి 18
దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి శనివారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించినట్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చీఫ్ సూపర్డెంట్ ఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ పరీక్షలు మొత్తం 216 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 203 మంది విద్యార్థులు హాజరైనట్టు అలానే 13 మంది గైర్హాజయ్యారు అయినట్లు తెలిపారు పరీక్ష కేంద్రం వద్ద మాస్ కాపింగు జరగకుండా తహాసిల్దార్ చంద్రశేఖర్ డిప్యూటీ తహసిల్దార్ ప్రతాప్ ఫ్లయింగ్ స్కాడ్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గరుడాచలం అన్నారు పోలీస్ వారితో 144 సెక్షన్ ప్రతిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.