మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 18 మండల పరిధిలోని సమత్ భట్టుపల్లి గ్రామనికి చెందిన సోయం శ్రీనివాస్ నాగాంజలి దంపతుల కుమారుడు సునీల్ కుమార్ వివాహం సరస్వతిల వివాహ వేడుకకు శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,పిఏ చందా.హరిక్రిష్ణ,నాయకులు బైరిశేట్టి.చిరంజీవి,సార.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
