UPDATES  

 సుగంధ ఎగుమతుల్లో ఎర్ర బంగారానిదే అగ్రస్థానం.. ఎండుమిర్చికి ఎర్ర తివాచీ..

  • సుగంధ ఎగుమతుల్లో ఎర్ర బంగారానిదే అగ్రస్థానం
  • ఎండుమిర్చికి ఎర్ర తివాచీ
  • మహిళా ఎక్స్ పోర్టర్స్ ప్రత్యేక ప్రోత్సాహకాలు వినియోగించుకోవాలి
  • వరంగల్ కేంద్రంగా మిర్చి టెస్టింగ్ ల్యాబ్ మంజూరు చేయాలి

మన్యం న్యూస్, మంగపేట. మార్చి 18

సుగంధ ద్రవ్యాల పంటల ఎగుమతుల్లో ఎండుమిర్చి ఎర్ర బంగారానిదే అగ్రస్థానం అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. శనివారం వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో స్పైసెస్ బోర్డు సహాయ సంచాలకురాలు విద్యుస్ట్న అధ్యక్షతన వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బొమ్మిడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగుమతుదారుల కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి సాంబశివరెడ్డి హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ గడచిన మూడు సంవత్సరాలుగా మిర్చికి మార్కెట్లో మంచి ధర ఉండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎండుమిర్చికి అదనపు విలువ జోడింపు కోసం స్పైసెస్ బోర్డు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సంయుక్తంగా కృషిచేసి రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ఎండుమిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తుందని వచ్చే సంవత్సరం మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా వరంగల్ కేంద్రంగా శీతల గిడ్డంగుల స్టోరేజ్ సదుపాయాలు మార్కెటింగ్ వసతులు మొదలైన వాటిపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో శీతల గిడ్డంగి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ కేంద్రంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో భారత ప్రభుత్వం వాణిజ్య ఎగుమతుల మరియు పరిశ్రమల శాఖ నుంచి మిర్చి టెస్టింగ్ ల్యాబ్ మంజూరు చేయాలని ఆయన కోరారు.విదేశీ ఎగుమతులకు అనుగుణంగా తెలంగాణలోని మిర్చి రైతాంగం ఐపిఎం ఆర్గానిక్ పద్ధతుల్లో సైతం ఎండుమిర్చి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు భాగస్వామ్యంతో కృషి చేయాలని ఆయన కోరారు. భారత ప్రభుత్వం జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ నుండి మహిళ ఎగుమతుదారుల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న రాయితీ పదకాలను వరంగల్ ఎక్స్ పోర్టర్స్ వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ వరంగల్ ప్రాంతీయ కార్యాలయం సహాయ సంచాలకురాలు శ్రీమతి విద్యుస్ట్న తమ శాఖ ద్వారా అమలుపరుస్తున్న వివిధ పథకాలను ఎగుమతి దారులకు వివరించారు.చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మిడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో కూడిన మిర్చి పంటను పండించేందుకు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు సలహాలు ఇచ్చేందుకు స్పైసెస్ బోర్డు ముందుకు వస్తే రైతు శిక్షణా తరగతులకు అవసరమయ్యే నిధులను తమ చాంబర్ ఆఫ్ కామర్స్ భరించేందుకు సిద్ధంగా ఉన్నామని రవీందర్ రెడ్డి ప్రకటించారు.ఎగుమతి దారులకు అవసరమైన పథకాలను స్వైసెస్ బోర్డు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !