UPDATES  

 రైతన్న గోస…. అకాల వర్షంతో నిండా మునిగిన రైతు… ఆరు ఎకరాల మిర్చి పంట నీటి పాల..

  • రైతన్న గోస….
  • అకాల వర్షంతో నిండా మునిగిన రైతు
  • ఆరు ఎకరాల మిర్చి పంట నీటి పాల

మన్యం న్యూస్, పినపాక, మార్చి 19..

అకాల వర్షం రైతన్నను నిండా ముంచేసింది. ఆరుగాలం పండించిన పంటను మార్కెట్ కు తీసుకెళ్దాం అనే లోపే తుపాను కారణంగా ఆరబోసిన పంట వర్షం నీటిలో మునిగిపోయింది. పినపాక మండల పరిధిలోని, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతు పొనగంటి లక్ష్మణరావు ఆరు ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశాడు. మార్కెట్ ధర కూడా అధికంగానే ఉండడంతో, అమ్ముతే అప్పులన్నీ పోయి లాభాలు వస్తాయని ఆశతో ఉన్నాడు. కానీ అకాల వర్షం అతని ఆశలను నిరాశపరచింది. ఆరు ఎకరాల లో సాగు చేసిన మిర్చి పంటను ఆరుదల కోసం ఉంచగా ఉపరితల ధోని ప్రభావంతో గులాబీ తుఫాన్ కారణంగా మిర్చి పంట మొత్తం బరకాలు కప్పినప్పటికీ పూర్తిగా నీరు చేరడంతో మొత్తం తడిసిపోయిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వం తన పరిస్థితిని గమనించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నా

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !