UPDATES  

 ఘనంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతి…

మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 19 : మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి మాట్లాడుతూ….ఆమె ఆశయాలు కోసం పోరాటం చేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు పెద్దిని వేణు, రామడుగు వెంకటాచారి, పార్టీ నాయకులు చల్లపల్లి రాజా, చింతల భూపాల్, పోట్రు వీరభద్రం, ఉపతల గోపాల్ ,నరసింహారావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !