UPDATES  

 ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే పేపర్ లీక్..  మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం, మార్చి 19

ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని దానికి బాధ్యతగా వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టి పి సి సి పిలుపు భద్రాచలం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పేపర్ లీక్స్ ఘటనపై ఆదివారం మండల కేంద్రంలోని మొలకపాడు సెంటర్లో కేటీఆర్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అధ్యయనంగా మారిందని ఉద్యోగుల కోసం రాష్ట్రంలో సరైన న్యాయం జరగడం లేదని యువత పోరాటంతో వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం చిన్నబినం చేస్తుందని వారికి నచ్చిన వారికి ఉద్యోగాలను అమ్ముకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఈ పేపర్ లీక్ ఘటనపై బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సీతారామారావు సీనియర్ నాయకులు అప్పల రెడ్డి పిలక వెంకటరామరెడ్డి సాంబశివరావు డివిజన్ యూత్ సెక్రెటరీ లంక శివ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ కనుబుద్ది దేవ లంక రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !