మన్యం న్యూస్, ఇల్లందుటౌన్.. మార్చి 19 దివ్యాంగుల వివిధ సమస్యల పరిష్కారానికి ప్రయోజనాల లబ్ధి కొరకు ఎన్పిఆర్డి ఇండియా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉప్పలయ్య ఆధ్వర్యంలో స్థానిక మెయిన్‌రోడ్డు హైస్కూల్ వేదికగా సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎన్పిఆర్డి ఇండియా ఇల్లందు పట్టణ అధ్యక్షులుగా టి.ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎస్.ఈశ్వర్, సెక్రటరీగా సీహెచ్. రాజేందర్ లను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు రామచందర్, లోధ్ రామ్ కిలావన్, కిషోర్, ఆర్.రవి తదితరులు పాల్గొన్నారు.
