UPDATES  

 టీఎస్ఏటీఎఫ్ నూతన డైరీ ఆవిష్కరణ..

మన్యం న్యూస్,ఇల్లందు.. మార్చి 19:తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ 2023 నూతన డైరీని ఇల్లందులోని జెడ్పీఎస్ఎస్ సుభాష్ నగర్ పాఠశాలలో రాష్ట్ర అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు మోకాళ్ల శ్రీనివాసరావు, కబ్బాకుల రవి ఆవిష్కరించారు. అనంతరం సంఘ నిర్మాణం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. జీవో నెంబర్ మూడు ప్రకారం బదిలీలు, పదోన్నతులు తదితర కోర్ట్ కేసులపై రాబోయే రోజుల్లో ఏ విదంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి మాట్లాడారు. ఏజెన్సీలలో జీవో నెంబర్ మూడుప్రకారమే పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేసారు.ఈ సందర్భంగా సంఘ ఆడిట్ ను కుర్సం అంజయ్య ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఉండం నాగేందర్రావు, భద్రాద్రి జిల్లా అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు పాయం ఆనందరావు,చాపల రమేష్ బాబు వీరితోపాటు ఉపాధ్యాయులు మోకాళ్ళ కృష్ణార్జున్,కొడెం క్రిష్ణ,కల్తీ భాస్కర్ రావు,అరేం రవికుమార్, కుంజ రామారావు,ఈశ్వర్,బొల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !