మన్యం న్యూస్, అశ్వారావుపేట, మార్చి, 19..
అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు ఆదివారం నుంచి జాతర ప్రారంభం అయ్యింది. జాతరలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పడిన భారీ వర్షానికి వంట సామాగ్రి మొత్తం తడీచిపోయి వండుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అక్కడున్న సుమారు 300 మందికి మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేసి వారి ఆకలిని తీర్చారు. ఈ సందర్భంగా వారందరికీ భోజనం వడ్డించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మేనల్లుడు తాటి ప్రదీప్ చంద్ర, స్థానిక నాయుకులు. ఈ కార్యక్రమంలో బిర్రం వెంకటేశ్వరరావు, రాజేష్, సాంబ శివరావు, అశ్విన్, ప్రసాద్, ఉప్పల నాగు, రామినేని సురేష్, రవి, గడ్డం చిట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.