మన్యo న్యూస్ మణుగూరు వెంకటాపురం మార్చి 19
వెంకటాపురం మండలం నేలర్ పేట గ్రామంలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి గా పడుతున్న వర్షాలకు నెలపేట గ్రామంలో ముత్తునూరి ప్రవీణ్ కుమార్ అనే వ్యవసాయ కూలీ ఇంటిపై వందల ఏళ్ల నాటి చింతచెట్టు పడింది. దాంతో వేనకవైపు చెట్టు కింద ఉన్నఇల్లు కూలిపోయింది. రాత్రి సమయం అవ్వడంతో హుటా హుటిన భార్య భర్త పిల్లలతో సహా అందరూ బయటకు వచ్చి బరకం గట్టుకొని బయటనే పడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆవేదన వ్యక్తం చేశారు ఆ బీద వ్యవసాయ కూలీకి ఏర్పడ్డాయని . రోజు కూలి చేసుకునే తనకు మళ్లీ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని. తన గోడును వెలగక్కాడు. ఎలాగైనా ప్రభుత్వం తమ ను గుర్తించి ఆర్థిక సాయం చేయవలసిందిగా ప్రవీణ్ దంపతులు కోరారు.