- భక్తుల వద్దకే భద్రాద్రి రాముని తలంబ్రాలు
- -ఆర్టీసీ కార్గో ద్వారా సరఫర
- -రాముని కళ్యాణికి వెళ్లలేని భక్తులకు టిఎస్ ఆర్టీసీ సువర్ణ అవకాశం
- -భక్తులు సద్వినియోగం చేసుకోవాలి:డిపో మేనేజర్ స్వామి
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:,మార్చి 19
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తలంబ్రాలను భక్తుల వద్దకే నేరుగా అందజేయనున్నట్లు మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి ఆదివారం విలేకరులకు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేరుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తులు కార్గో సెంటర్ల ద్వారా రూ.116 రూపాయలు చెల్లించి,ఎంతో పవిత్రంగా భావించే శ్రీ సీతారాముల ముత్యాల తలంబ్రాలను పొందవచ్చును అన్నారు. మణుగూరు డిపో పరిధిలోని సురక్ష బస్టాండు,అశ్వాపురం, మెుండికుంట,కరకగూడెం,బయ్యారం లోని కార్గో పాయింట్ల నందు తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు వారు తెలిపారు. పూర్తి వివరాలకు మణుగూరు డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సైదులు పోన్ నెంబర్ 9154298588 సంప్రదించాలని సూచించారు.