మన్యం న్యూస్ దుమ్ముగూడెం, మార్చి 19
తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని మళ్లీ అధికారంలోకి బిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మండల ప్రధాన కార్యదర్శి కనితిరాముడు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని లక్ష్మీనగరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి ఇంటికి చేరాయని ఈ అభివృద్ధి తోనే ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని 2023 జరిగే ఎన్నికల్లో ఆ పథకాలు పార్టీని గెలిపిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా ఎంపీటీసీ తిరుపతిరావు పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు నాయకులు సుబ్బారావు నాగరాజు జిలకర గంగరాజు చినబాబు తదితరులు పాల్గొన్నారు.