మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 19 : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు అన్నారు. ఆదివారం అయ్యన్నపాలెం గ్రామంలో ఉగాది పండగ సందర్భంగా ముత్యాలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువులో రాణిస్తూ క్రీడల్లో కూడా ప్రతిభ కనబరిచి గ్రామానికి మండలానికి మంచి పేరు తేవాలని వారిని కోరారు.వాలీబాల్ ఆడేందుకు కమిటీకి వాలీబాల్ కిట్టుతో పాటు ప్రైస్ లు ఉప్పతల ఏడుకొండలు అందజేసినట్లు కమిటీ వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు లక్ష్మణరావు,రామరాజు,గ్రామస్తులు చాపలమూడి వెంకటేశ్వర్లు, ఆళ్లకుంట రామదాసు, సాంబ, వెంకటనారాయణ, మోహన్ రావు,తదితరులు పాల్గొన్నారు.
