మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 19 : మండల కేంద్రంలోని గత రెండు రోజుల నుండి అకాల వర్షాలు పడడంతో మండల పరిధిలోని రాజాపురం,యార్రగుంట,జానకీపురం గ్రామాలలోని మామిడి,వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళనల వ్యక్తం చేశారు.ఒక ఎకరానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు బస్తాల ఒడ్లు రాలి ఉంటాయని రైతులు చెప్పారు.మామిడి పూత పిందె దశలో వుండడంతో ఈదురు గాలులకు పూర్తిగా నేలపాలయ్యాయి.ఇకనైనా వ్యవసాయ శాఖ,ఇతర శాఖ అధికారులు వెంటనే స్పందించి పంటను పరిశీలించి నష్టాపరిహారం అందించాలని రైతులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
