మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి 19 : బీసీల ఐక్యత కోసం తన వంతు కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బండి శ్రీకాంత్ అన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తనను జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో యువజన అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలు యువజనులు ఉపయోగించుకునేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ సమావేశంలో మండల నాయకులు పాల్గొన్నారు.
