మన్యం న్యూస్ నూగుర్ వెంకటాపురం మార్చి 19 .
వెంకటాపురం మండలం వెంగళరావు పేట గ్రామంలో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు వేల ఎకరాల పంట నీట మునిగాయి. ఆరు నెలలు పండించి తీరా నోటిదాకొచ్చిన పంట నీటి పాలు అవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మునిగిన మిర్చి పళ్ళను జెడ్డీలు వేసుకొని నీళ్లలో నుంచి పళ్ళను ఏరి ట్రాక్టర్ లో వేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.
అసలే నీటిలో పండించిన పంటమునిగి రైతులు ఎంతో బాధలో ఉంటే ఇంకొక వైపు ఇంకా రేటు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, గ్రామ రైతులు వాపోతున్నారు. తమకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రేటు ఎంత అయితే ఉందో అంతే గిట్టుబాటు ధర కల్పించాలని గ్రామాల రైతులు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలే కూలి సమస్యలు కూలీలు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి అకాల వర్షాలతో నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆదుకొని తమ మీద దయ చూపెట్టాలని యావత్ రైతాంగం కోరుతున్నారు. ప్రతి సంవత్సరం నష్టపోయి ఈ సంవత్సరం కొంచెం గిట్టుబాటు ధర ఉందనుకొని ఆనందపడేలోపే ఈ వర్షం వల్ల కనీసం కూలీలకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కనపడతలేవు అని వారి బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతన్న లను దృష్టిలో పెట్టుకొని సాయం చేయాలని కోరుతున్నారు.