- ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో టిఆర్ఎస్ జండా ఎగురవేస్తాం
- బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యం
- దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర సంక్షేమ పథకాలు
- జిల్లాలో 10 గ్రామాలకు ఒక సమావేశాన్ని నిర్వహిస్తాం
- రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ పార్టీల మాటలన్నీ అబద్ధమే
- జిల్లాలో కార్యకర్తలు అందరిని సమన్వయం చేస్తున్నాం
- విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 20…. వ్యూహ రచనలతో పాటు సరికొత్త కార్యచరణ ప్రణాళికలతో భారత రాష్ట్ర సమితి గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకొని సమిష్టిగా పనిచేసే జరగబోయే ఎన్నికల్లో బీ ఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొడతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా తాను నియమించబడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భద్రాద్రి జిల్లాకు తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో చారిత్రాత్మకంగా మిగిలాయి అన్నారు. పార్టీ విధివిధానాలను గ్రామస్థాయి వరకు తీసుకు వెళ్లేందుకు జిల్లాలో సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు గ్రామ మండల పార్టీ నాయకులు కూడా ఎంతో కష్టపడాలని అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బిజెపి కాంగ్రెస్ పార్టీలు అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని అగ్రగామిగా నిలబడ్డాయని ఈ విషయంలో ప్రతి తెలంగాణ బిడ్డని అడిగిన నిగర్వంగా చెప్పుకుంటారని అన్నారు. బి ఆర్ ఎస్ కు వెన్ను దండుగా ఉండే కార్యకర్తలు ఎంతో కీలకమని తప్పకుండా వారు సైనికులుగా పనిచేసే మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పార్టీ విధివిధానాలు సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గానికి చేరే విధంగా అయా నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు. తొలుత కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులకు పుష్ప గుచ్చాన్ని అందించి ఆ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ ఇంచార్జ్ భాను ప్రసాద్ తో పాటు ఎమ్మెల్యే రేగా తదితర ఎమ్మెల్యేలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించుకొని పార్టీ విధివిధానాలపై చర్చించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, తాత మధు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట ఇల్లందు ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, మెచ్చ నాగేశ్వరరావు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీత లక్ష్మి, ఎంపీపీ భూక్య సోనా తదితరులు పాల్గొన్నారు