UPDATES  

 మంచినీళ్లు ఇప్పించండి మహాప్రబో… ..

  • మంచినీళ్లు ఇప్పించండి మహాప్రబో
  •  త్రాగునీరు కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
  • మద్దతుగా టిపిసిసి సభ్యురాలు వగ్గెల పూజ

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, మార్చి 20 అశ్వరావుపేట మండలం బచ్చువారి గూడెం గ్రామ పంచాయితీలో జెట్టివారిగుంపు లో త్రాగు నీరు రావడంలేదని కాళీ బిందెలతో మహిళలు రోడ్డు మీద బైటాయించి సోమవారం ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనకు టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ మద్దతు పలికారు వారితో పాటు రోడ్డు పై కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వగ్గెల పూజ మాట్లాడుతూ ప్రజలు త్రాగు నీరు లేక ఇబ్బందులుపడుతుంటే నిద్రపోతున్న అధికార పార్టీ అధికారులు అంటూ ప్రభుత్వ అధికారుల పై మండిపడ్డారు. బచ్చువారి గూడెం పంచాయతి జెట్టివారి గుంపులో ఆర్ డబ్లు యస్ నీళ్లు గత 20 రోజులుగా రాకపోవడంతో త్రాగునీరు ఇంటిలోనే మౌలిక సదుపాయాలు తీర్చుకోవడానికి కూడా త్రాగునీరు ప్రధాన సమస్యగా మారిందని, ఈ త్రాగునీరు సమస్యపై గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజానీకులతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు విరికి తోడుగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ నేథ్యంలో అశ్వరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొగళ్లపు చెన్నకేశ్వరావు వగ్గేలపూజ , వేముల భారతి, బండారు మహేష్, దాసరి రవి, పసుపులేటి నరేష్ మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యులు వారికి తోడుగా ఉండి సమస్యను తీర్చవలసిందిగా ధర్నా చేశారు. ఎంపీఓ సీతారామరాజు అక్కడకి చేరుకొని సమస్య పరిష్కరిస్తామని నచ్చ చెప్పడంతో ధర్న విరమించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !