మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి మార్చి 20… పాత్రికేయ కుటుంబాలు ఎవరికి ఆపద వచ్చినా సకాలంలో స్పందించి సహాయ సహకారాలు అందించడంలో మంచి మనసున్న వ్యక్తి కల్లోజి శ్రీనివాస్ అని పలువురు సీనియర్ పాత్రికేయులు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యూజే( టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కల్లోజు శ్రీనివాస్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షఫీ, టెంజు అధ్యక్ష కార్యదర్శులు వట్టి కొండ రవి చింతల నరసింహారావులు మాట్లాడారు. ఒకవైపు పాత్రికేయుడుగా పని చేస్తూ మరోవైపు పాత్రికేయుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎంతో కృషి చేస్తున్న కల్లోజి శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఇటీవల కాలంలో పాత్రికేయులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పాత్రికేయులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా కరోనా కష్టకాలంలో ఎందరో పాత్రికేయ కుటుంబాలకు ఆర్థిక సహకారాన్ని అందించారన్నారు. అంతేకాకుండా పాత్రికేయులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ఇటీవల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలను చేయించారని కల్లోజి సేవలకు ఇది తార్కానమన్నారు. అనంతరం పాత్రికేయుల ఆనందాల మధ్య కల్లోజి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని పాత్రికేయులు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, మోటమర్రి రామకృష్ణ, చెంగపొంగు సైదులు, అఫ్జల్ పఠాన్, కాకటి బాబు, కెరటం శ్యామ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.
