మన్యం న్యూస్,పినపాక, మార్చి 20
ఆదివాసి కళాకారులను సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ కళావైభవం పేరుతో, పినపాక మండలంలోని సింగిరెడ్డిపల్లి పంచాయతీలో గల దేవనగరం గ్రామంలో ఉన్న సమ్మక్క సారలమ్మ బద్ది పోచమ్మ దేవాలయంలో మంగళవారం నాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆదివాసి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.