- బిజెపిని గద్దె దించడానికి పార్టీలు అన్ని ఏకం కావాలి..
- రాష్ట్రంలో బిజెపిని తరిమి కొట్టడానికి బిఆర్ఎస్ తో కలిసి పని చేస్తాం..
- మునుగోడు లో మా సత్తా ఏంటో చూపించాం..
- కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసనగా ప్రజా చైతన్య యాత్ర..
- భద్రాచలం సీటు సిపిఐఎం దే, దుమ్ముగూడెం కమ్యూనిస్టుల గడ్డ.. తమ్మినేని వీరభద్రం..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం: మార్చి 20
బిజెపి పార్టీని గద్దె దించడానికి పార్టీలన్నీ ఏకం కావాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారూ. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ జన చైతన్య యాత్రను ప్రారంభించారు ఈ యాత్ర సోమవారం మండలంలో చేరుకుంది. విజయ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్య పరిచేందుకే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు మండలంలోకి ప్రవేశించిన యాత్ర బృందానికి పార్టీ శ్రేణులు ముసలమడుగు గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు అనంతరం వందలాది ద్విచక్ర వాహనాలు ఆటోలలో ర్యాలీగా లక్ష్మీ నగరం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎలమంచి సీతారామయ్య స్తూపం వద్ద మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిజెపి ప్రభుత్వం ఈడి సిబిఐ దాడులకు భయపడకుండా భారత రాష్ట్ర సమితి పేరుతో దేశవ్యాప్తంగా తిరుగుతూ లౌకికవాద శక్తులను ఏకం చేస్తున్నారని ఇది శుభ పరిమణామమని అన్నారు దేశంలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంతో సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిలిందని దాని మూలంగానే రాష్ట్రంలోకి బిజెపి ప్రభుత్వాన్ని రానివ్వకుండా టిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిపిఎం సిపిఐ సిద్ధంగా ఉన్నాయని దాని ఫలితంగానే మునుగోడులో వారి ఆటలు సాగనివ్వలేదని తెలిపారు మునుగోడులో ఇప్పటికే కమ్యూనిస్టుల సత్తా ఇంటూ చూపించామని హెచ్చరించారు బిజెపి పై చేస్తున్న వ్యతిరేక పోరాటంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. 2006 అటవీ చెక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం సిపిఎం ఎప్పుడు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుందన్నారు టిఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా భద్రాచలం అసెంబ్లీ స్థానం సిపిఎం పోటీ చేస్తుంది అన్నారు ఎర్రజెండా ఉద్యమానికి దుమ్ముగూడెం పట్టణ కోటని ఇది కమ్యూనిస్టు అడ్డా అని గుర్తు చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ఈ మాటతో హర్ష రేతికలు మోగించారు. అనంతరం పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ నరరూప రాక్షసుడు నరేంద్ర మోడీ అని మూడు నల్లా చట్టలను తీసుకువచ్చి 760 మంది రైతులను పొట్టను పెట్టుకున్న వ్యక్తి మోడీ అని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో అదాని అంబానీ నీరజ్ మోడీ కోసం ప్రభుత్వం పని చేస్తుందని, ఆశలకు అంగన్వాడీలకు కనీస వేతనం చట్టం అమలు చేయాలని కోరారు భద్రాచలం నియోజవర్గంలో మార్క్ స్ట్ మేధావి ఎలమంచి సీతారామయ్య ఆశయ సాధన కోసం ఎర్రజెండ్ ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు పాలగుడు భాస్కరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సిపిఐఎం రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు మాజీ డిసిసిబి చైర్మన్ రవికుమార్ జిల్లా కార్యదర్శి సభ్యులు పుల్లయ్య కే బ్రహ్మచారి జిల్లా నాయకులు వంశీకృష్ణ కొరస చిలకమ్మ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.